Shoaib Akhtar..This name is well known to cricket fans around the world. The Pakistani bowler, who bowled with speed of 150 km per hour, served Pakistan for a long time.
#shoaibakhtar
#cricket
#pakistansuperleague
#shoaibmalik
#wasimakram
#150kmspeed
#rawalpindiexpress
#twitter
షోయబ్ అక్తర్.... ఈ పేరు ప్రపంచ లోని క్రికెట్ అభిమానులకు బాగా సుపరిచితం. గంటకు 150 కిలోమీటర్ల వేగం తో బంతులు వేసే ఈ పాకిస్తానీ బౌలర్,చాలా కాలం పాటు పాకిస్తాన్ క్రికెట్ కు సేవలందించాడు. తరువాత క్రికెట్ కు గుడ్ బై చెప్పి...మిగతా టైం ని ఫ్యామిలీ తో గడుపుతున్నాడు. అయితే రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి14న మళ్లీ మైదానంలోకి వస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా బుధవారం ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు."ఈరోజుల్లో పిల్లలు క్రికెట్ గురించి చాలా విషయాలు తెలుసనుకుంటున్నారు. అంతేకాదు నా ఫాస్ట్ బౌలింగ్‌ను సవాల్ కూడా చేయగలరు. కాబట్టి నేను మళ్లీ బంతి పట్టుకుంటున్నాను. అసలైన బౌలింగ్ వేగం అంటే ఏంటో వారికి నేను చూపిస్తాను" అని ఆ వీడియోలో అక్తర్ పేర్కొన్నాడు. అంతేకాదు షోయబ్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ కూడా పెట్టాడు.